పని ఒత్తిడి తగ్గించండి..జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

పని ఒత్తిడి తగ్గించండి..జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

 హైదరాబాద్ సిటీ, వెలుగు: పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు  ప్రాపర్టీ ట్యాక్స్ విభాగంలోని రెవెన్యూ ఉద్యోగులు, ట్యాక్స్ ఇన్‌‌‌‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు బుధవారం ధర్నా చేపట్టారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మంద రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు బీఎంఎస్ మద్దతు ప్రకటించింది. ప్రతి నెలా రూ.100 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్లతో పాటు ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టైజ్​మెంట్ విధులు అప్పగించడంతో ఒత్తిడి పెరిగిందని, టార్గెట్లు చేరని వారికి నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని ఉద్యోగులు వాపోయారు.

 మున్సిపల్ చట్టం ప్రకారం ట్యాక్స్ కలెక్షన్ మాత్రమే చేయాల్సి ఉండగా, ఎన్నికల విధులు, అదనపు బాధ్యతలతో సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారననారు. ఒక ట్యాక్స్ ఇన్‌‌‌‌స్పెక్టర్ గుండెపోటుతో ఆస్పత్రి పాలైనట్లు మంద రవి తెలిపారు. ధర్నా అనంతరం కమిషనర్​కు వినతిపత్రం అందజేయగా, అదనపు విధుల మినహాయింపుపై పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.