ఆస్తి పన్ను వసూళ్లపై బల్దియా దృష్టి

ఆస్తి పన్ను వసూళ్లపై  బల్దియా దృష్టి

హైదరాబాద్: బల్దియా సిబ్బంది ఆస్తి పన్ను వసూళ్లపైనే దృష్టిపెట్టారు.  టార్గెట్ చేరుకోవడానికి పనులన్నీ పక్కన పెట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు టైం టు టైం రివ్యూ చేస్తూ టాక్స్ వసూళ్లు చేస్తున్నారు. బల్దియా ఆదాయంలో ప్రాపర్టీ టాక్స్ షేర్ పెద్దది కావడంతో అందరి దృష్టి వసూళ్ళపైనే ఉంది.   మరో 2 రోజుల్లో అనుకున్న టార్గెట్ ను బల్దియా రీచ్ అవుతుందా... ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు  ఏం చేస్తారన్నది ప్రశ్నగా మారింది. 

జీహెచ్ఎంసీ  బడ్జెట్ కి పెద్ద  మొత్తంలో ఆదాయం వచ్చేది ప్రాపర్టీ టాక్స్ తోనే.  దాంతో బిల్ కలెక్టర్ మొదలు కమిషనర్ దాకా  అందరూ టాక్స్ కలెక్షన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత ఏడాది డిమాండ్, ఏరియర్స్ కలిపి 2 వేల 400 కోట్లకు పైగా ఉంటుంది. గత ఏడాది 17 వందల  కోట్ల ఆస్తి పన్నును వసూలు చేసింది కార్పొరేషన్.  ఈసారి 18 వందల 52 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.   గ్రేటర్ పరిధిలో  17లక్షల ఆస్తిపన్ను  చెల్లింపులుదారులు ఉన్నారు.  వీటిల్లో కమర్షియల్ షాపింగ్స్ కాంప్లెక్సులు  3 లక్ష ల దాకా  ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఇప్పటి వరకు 13 వందల 72  కోట్లు  ఆస్తి పన్ను వసూలైంది. అయితే ఈ ఎడాది పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే మ రో 478 కోట్ల రూపాయ లు వ సూలు చేయాలి. బల్దియాలో సాధారణ రోజుల్లో ప్రతి రోజూ కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ వసూలవుతుంది. స్పెషల్ ఫోకస్ పెట్టడంతో రెండున్నర నుంచి మూడు కోట్లకు పెరిగింది.  సాధారణంగా చివరి రెండు రోజుల్లో 100 కోట్ల ఆస్తిపన్ను వసూలవుతుంది. కానీ ఈ ఏడాది టార్గెట్ రీచ్ కావడం కష్టంగానే ఉంది. ఇప్పటికే  ప్రతి ఆదివారం టాక్స్ చెల్లింపులో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నా... దానికి జనం నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు.

బల్దియాను ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నాలాల విస్తరణ , సమగ్ర రోడ్డు డెవ ల ప్మెంట్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కావాలి. దాంతో రెగ్యుల ర్ మెయింటెనెన్స్ ప నులు, జీతాలకు కూడా క ష్టంగా ఉంది. ఎప్పటికప్పుడు వసూలవుతున్న  ఆస్తి పన్ను డ బ్బులతోనే అన్ని పనులకు సర్దుబాటు చేస్తున్నారు.  ఆర్థిక సంవత్స రం  చివరలో కూడా పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లింపుల  కోసం వ స్తాయి. వీటన్నింటినీ తట్టుకోవాలంటే బల్దియాకి పన్ను వసూళ్ళు తప్పనిసరి అయింది. 

మరిన్ని వార్తల కోసం..

9 రోజుల్లో రూ.5.60 పెరిగిన పెట్రోల్

భారీగా పడిపోయిన విరాట్ బ్రాండ్ వాల్యూ

సీఆర్పీఎఫ్ బంకర్‌‌పై బాంబు వేసిన మహిళ