- అన్నం తిన్నాక చేతులు కడుక్కోవడానికీ నీళ్లు లేవ్
- రెండు ఇంచుల పైపుల్లో హాఫ్ ఇంచ్ మాత్రమే సరఫరా
- రోజూ 10 ట్యాంకర్లు తెప్పించినా సరిపోతలేవ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో రెండు రోజులుగా నీళ్లు లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం నుంచి టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు సైతం సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. దీంతో మినరల్ వాటర్ బాటిల్స్కొనుక్కోవాల్సి వస్తున్నది. సమస్యను తాత్కాలికంగా అధిగమించేందుకు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు తెప్పిస్తున్నా సరిపోవడం లేదు. గురువారం ఒక్కరోజే 10 ప్రైవేట్వాటర్ట్యాంకర్ల నీళ్లు తెప్పించినా చాలలేదు. రెండోరోజు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడో అంతస్తు వరకు చుక్క నీరు రాలేదు. నగర సమస్యలను పరిష్కరించాల్సిన ఆఫీసులో రెండు రోజులవుతున్నా ఇలాంటి కష్టాలు ఎదురుకావడం విమర్శలకు తావిస్తోంది. జలమండలి వేసిన రెండు ఇంచ్ ల పైపు లైన్ లో కేవలం హాఫ్ఇంచ్మాత్రమే నీళ్లు వస్తున్నాయని, బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్య ఉందని జీహెచ్ఎంసీ బిల్డింగ్ మెయింటెనెన్స్ అధికారులు చెప్తున్నారు. వాటర్బోర్డు టెక్నికల్ టీమ్సమస్య గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నా ఫలితాన్నివ్వడం లేదని చెప్పారు.
ప్రైవేట్ ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసినట్టు?
అకస్మాత్తుగా సప్లై తగ్గడంతో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం 10 ప్రైవేట్వాటర్ట్యాంకర్లు తెప్పించారు. ఒక్కో ట్యాంకర్ కి రూ.1200 ఖర్చు చేశారు. జలమండలి ట్యాంకర్ బుక్ చేస్తే ఎప్పుడొస్తుందోనని ప్రైవేట్ ట్యాంకర్ బుక్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇదే విషయమై జలమండలి జీఎం జమీల్ హుస్సేన్ తో మాట్లాడగా.. ‘మా దగ్గర ట్యాంకర్లకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంకర్ బుక్ చేసి తమని సంప్రదిస్తే వెంటనే పంపించేవాళ్లం’ అని సమాధానం ఇచ్చారు. జలమండలి ట్యాంకర్ రూ.550కి ఉందని, వారు ఎందుకు ప్రైవేట్ట్యాంకర్బుక్చేసుకున్నారో తనకు తెలియదన్నారు. నీటి సప్లై విషయం తన దృష్టికి రాలేదని, తమ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

