జోనల్ ఆఫీస్లో సర్వర్ ధ్వంసం..నిందితుడు పిచ్చోడని వదిలేసిన పోలీసులు

జోనల్ ఆఫీస్లో సర్వర్ ధ్వంసం..నిందితుడు పిచ్చోడని వదిలేసిన పోలీసులు

కూకట్​పల్లి, వెలుగు: జీహెచ్ఎంసీ కూకట్​పల్లి జోనల్ ఆఫీసులోకి ఓ వ్యక్తి చొరబడి మెయిన్ సర్వర్ ధ్వంసం చేశాడు. మంగళవారం తెల్లవారుజామున సర్వర్ రూమ్ లోకి వెళ్లి వైర్లు తొలగించాడు. అనుమానాస్పద శబ్దాలు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లి సదరు వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు నిందితుడిని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించి వదిలేశారు. సర్వర్​ మొత్తం ధ్వంసం కావడంతో బుధవారం జోనల్​ కార్యాలయం, కూకట్​పల్లి, మూసాపేట సర్కిల్ ఆఫీసుల్లో ఇంటర్నెట్​సేవలకు అంతరాయం ఏర్పడింది.