స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ షురూ .. పరిశీలించిన కమిషనర్ ఆర్వీ కర్ణన్

స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ షురూ .. పరిశీలించిన కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్​ను జీహెచ్ఎంసీ మంగళవారం ప్రారంభించింది. ఈ డ్రైవ్​లో భాగంగా రోడ్లు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పారిశుధ్య కార్మికులు తొలగించారు. మురుగునీటి కాలువలను శుభ్రం చేసి, నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు.

 చార్మినార్, ఎల్బీ నగర్ జోన్లలోని పలు ప్రాంతాల్లో ఈ డ్రైవ్‌‌‌‌‌‌‌‌నుకమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా, స్వచ్ఛ ఆటోలకు అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.