
కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ లారీ అదుపుతప్పి గుడిసెల్లోకి దూసుకెళ్లింది. జీడిమెట్ల డిపో దగ్గర లారీ బ్రేక్ లు పెయిల్ కావడంతో రోడ్డు ప్రకన్న ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ చెప్పాడు.
ఈ ప్రమాదంలో గుడిసెల్లో నివాసముండే వారికి స్పల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.