సీఎం రేవంత్ ను కలిసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

సీఎం రేవంత్ ను కలిసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇవాళ  భేటీ అయ్యారు.  అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలుగా పెండింగ్ లో ఉన్న స్టాండిగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్ పై చర్చించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు మార్గం సుగుమం చేయాలనికోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తో ఫోన్ లో మాట్లాడారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు మేయర్ .

అయితే బీఆర్ఎస్ నేతలు  వరుసగా సీఎం రేవంత్ ను కలవడం గులాబీ నేతల్లో గుబులు పుడుతోంది. ఇప్పటికే ఒకే సారి నలుగురు  ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి, జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే..  తర్వాత పార్టీ మారడం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే  ప్రకాశ్ గౌడ్ కలవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను  కలవడంపై కేసీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు . పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎంను కలవాలంటే తనకు చెప్పి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో ఉన్నప్పుడే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం  మంత్రులకు వినతి పత్రం ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ చెప్పిన రెండు రోజులకే ఇవాళ మేయర్ గద్వాల విజయలక్ష్మీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.