ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పనుల పరిశీలన : అడిషనల్ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పనుల పరిశీలన : అడిషనల్ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

ఉప్పల్‌, వెలుగు : ఉప్పల్‌లో జరుగుతున్న ఫ్లైఓవర్‌ పనులను జీహెచ్‌ఎంసీ అడిషనల్​ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. పనుల పురోగతి, ఇంకా పూర్తి చేయాల్సిన అంశాలపై సంబంధిత విభాగాల అధికారులతో సమీక్షించారు. పనుల ప్రగతిని తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ రాధికా గుప్తా, ఉప్పల్‌ డిప్యూటీ కమిషనర్‌ జి.రాజు పాల్గొన్నారు.