ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలె: జీహెచ్ఎంసీ ఉద్యోగులు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలె: జీహెచ్ఎంసీ ఉద్యోగులు

జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఔట్ సోర్సింగ్ అనే పదం లేకుండా జీహెచ్ఎంసీ ఉద్యోగులను శాశ్వతంగా క్రమబద్దీకరిస్తామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చి.. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈరోజు(ఆగస్టు 22) విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. తమ న్యా యమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఇక్కడినుంచి కదిలేదే లేదని బీష్మించుకొని కూర్చున్నారు.

ఈ విషయంపై పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేకు సమస్యల గురించి వివరించినా.. ఫలితం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కిల్ కార్యాలయంలో 7 శాఖల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యికిపైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు.