జీడిమెట్ల, వెలుగు: దుండిగల్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. డి.పోచంపల్లిలో జి.ప్రవీన్, వానంరాములు అనే వ్యక్తులు అనుమతులకు మించి సెల్లార్, అదనపు అంతస్తులు నిర్మించడంతో ఆ రెండు భవనాలను బుధవారం సీజ్ చేశారు.
అలాగే బి.పద్మజ అనే మహిళ నిర్మించిన వాణిజ్య షెడ్‌కు సీల్ వేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భవన నిర్మాణాల సమయంలో జీహెచ్‌ఎంసీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే కూల్చివేతలు, సీజింగ్ చర్యలు తీసుకుంటామని ప్రజలకు హెచ్చరించారు.
