హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పలు రకాల సేవలను మీసేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్మీ సేవలో పలు సర్వీసులను 2025 నవంబర్ 18వ తేదీనే ప్రారంభించినప్పటికీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ప్రాపర్టీ అసెస్‌మెంట్ రివిజన్, బర్త్, డెత్ సర్టిఫికెట్ల సవరణ, హోమ్ బర్త్ (ఇంటి దగ్గర పుట్టిన), హోమ్ డెత్ (ఇంటి దగ్గర చనిపోయిన), ప్రాపర్టీ డోర్ నంబర్ సవరణ, ప్రాపర్టీ పేరు సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్ సేవలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ సేవలను చేర్చారు.
ఈ సేవలు పొందేందుకు వాట్సాప్ నంబర్ 8096958096 కి హాయ్ అని మెసెజ్ పంపాలని, తర్వాత అవసరమైన సేవ పేరు టైప్ చేసి, మెనూలో కనిపించే ‘ఓపెన్ సర్వీసు’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. అనంతరం ఫారంలో అడిగిన వివరాలు, చెల్లింపు పూర్తిచేస్తే దరఖాస్తు వెంటనే వాట్సాప్ ద్వారా నమోదవుతుందన్నారు.
