- 10 సెంటర్లలో 270 మందికి సదుపాయం
- రోడ్ల పక్కన ఉంటున్న వారిని హోమ్స్ కు తరలిస్తున్న సిబ్బంది
- పేషెంట్ కేర్ అటెండెన్స్ కోసం ఏడు హాస్పిటల్స్‌లో సెంటర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మహా నగరంలో ఉండడానికి చోటులేక రోడ్లు, ఫుట్ పాత్ లు, బస్టాపులు తదిరత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారికి జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్ అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో వణుకు పుట్టించే చలిలో ఇబ్బందులు పడుతున్న వారిని బల్దియా సిబ్బంది గుర్తించి, హోమ్స్‌కు తీసుకువెళ్తున్నారు. వీరితోపాటు సిటీకి పనుల కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చి కొద్ది రోజులు ఉండే వారికి కూడా ఈ హోమ్స్ లో ఉండేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఇక ఇండ్లల్లో గొడవలు, ఇతర సమస్యలతో బయటకు వచ్చే వృద్ధులు, మానసిక సమస్యలతో బయట తిరుగుతున్న వారు కూడా ఈ హోమ్స్‌లో ఉంటున్నారు. అయితే ఈ హోమ్స్ లో ఆరు నెలల వరకు ఉండేందుకే అవకాశం ఉండడంతో షెల్డర్ లో ఉంటున్న వారికి కుటుంబం ఉంటే అర్బన్కమ్యూనిటీ డెవలప్ మెంట్ అధికారులు కుటుంబసభ్యులతో చర్చలు జరిపి ఇండ్లకు వెళ్లేలా చేస్తున్నారు. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోతే సంబంధిత జిల్లాల అధికారులకు చెప్పి ఇంటికి పంపిస్తున్నారు. ఏ ఆధారం లేని వారిని మాత్రమే ఈ హోమ్స్‌లో కొనసాగిస్తున్నారు.
గ్రేటర్లో 10 హోమ్స్
జీహెచ్ఎంసీ ఆధ్యర్యంలో ప్రస్తుతం 10 షెల్టర్ హోమ్స్ కొనసాగుతుండగా ఇందులో 269 మంది వరకు ఉండే వీలుంది. ఉప్పల్, సరూర్ నగర్, గోల్నాక హోమ్స్ ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించగా, మిగతావి పురుషుల కోసం ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇందులో 164 మంది మాత్రమే ఉంటున్నారు. బేగంపేటలోని సెంటర్‌ను రికవరీ సెంటర్ గా ఉంచారు. మానసికంగా బాగా లేని వారితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ చేయించి ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఇతర సెంటర్లకు లేదా కుటుంబసభ్యులను గుర్తించి వారి వద్దకు పంపిస్తారు. ప్రస్తుతం ఈ సెంటర్ లో 40 మందికి అవకాశం ఉండగా, 25 మంది ఉంటున్నారు.
ఎన్జీవోల సహకారంతో..
నగరంలో ఉన్న 10 సెంటర్లు 8 ఎన్జీవోల సహకారంతో నడుస్తున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీతో ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా షెల్టర్ హోమ్స్ లో ఉంటున్నవారికి టిఫిన్, లంచ్, డిన్నర్ అందిస్తారు. ఒక్కో హోమ్ లో మేనేజర్ తో పాటు ముగ్గురు కేర్ టేకర్స్ ఉంటారు. ఈ షెల్టర్ హోమ్స్ రన్ చేస్తున్నందుకు ఒక్కో సెంటర్ కి జీహెచ్ఎంసీ రూ.23,333 ఇస్తుంది. అన్ని షెల్టర్‌హోమ్స్ భవనాలు జీహెచ్ఎంసీకి చెందినవే.
పేషెంట్ కేర్ అటెండెంట్ సెంటర్లు
- మహావీర్ హాస్పిటల్ సంతోష్ 7386667471
- నిలోఫర్ హాస్పిటల్ ఇంద్రసేన 9154909256
- మెటర్నరీ హాస్పిటల్, కోఠి – 9154857247
- ఈఎన్టీ హాస్పిటల్, కోఠి మల్లేశ్ 9391263933
- ఎర్రగడ్డ మెంటర్ హాస్పిటల్ – 9502992813
- నిమ్స్ హాస్పిటల్, పంజాగుట్ట మల్లేశ్ 9391263933
- గాంధీ హాస్పిటల్ నర్సింహా 9701914349
పేషెంట్ కేర్ అటెండెంట్ సెంటర్లు...
షెల్టర్ హోమ్స్ తరహాలో హాస్పిటల్స్ లోనూ పేషెంట్ల అటెండర్లు ఉండేందుకు పేషెంట్ కేర్ అటెండెంట్ సెంటర్లను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. సిటీలోని ఏడు ప్రధాన హాస్పిటల్స్ లో ఈ సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటన్నింటిలో కలిపి 650 మంది వరకు పేషెంట్ల అటెండర్లు ఉండేందుకు వీలుంది. ఈ బుధవారం 337 మంది వరకు ఈ సెంటర్లలో ఆశ్రయం పొందుతున్నారు.
పేషెంట్ల సంఖ్యను బట్టి ఇందులో అటెండర్లు ఉంటున్నారు. ఈ సెంటర్లలో మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందిస్తున్నారు వీటి నిర్వహణకు నెలకు బల్దియా రూ. 33 వేలను అందజేస్తోంది. ఈ బిల్డింగులు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ కి సంబంధించినవే.
షెల్టర్ హోమ్స్‌లో ఉండేందుకు కాల్ చేయండి
షెల్టర్ హోమ్ ప్రాంతం ఎన్జీవో కాంటాక్ట్ నంబర్
ఉప్పల్ కమ్యూనిటీ హాల్ అమన్ వేదిక 9966831014
పేట్లబురుజు వార్డు ఆఫీసు, చార్మినార్ ఏపీ మహిళా వెల్ఫేర్ సొసైటీ 9885096035
శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ గ్రేస్ ఎన్జీవో 9848076471
అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్, టప్పాచబుత్రా ఎల్ఎస్ఎన్ ఫౌండేషన్ 7989654635
కమలానగర్ కమ్యూనిటీ హాల్, గోల్నాక సయోధ్య 9346801646
బేగంపేట్ ఫ్లైఓవర్, కంట్రీక్లబ్ వద్ద శ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ 9985704234
వార్డు ఆఫీసు, యూసుఫ్ గూడ ఆశ్రే హోం ఫర్ ఏజ్డ్ 9000495026
ఓల్డ్ మున్సిపల్ ఆఫీసు, శేరిలింగంపల్లి ఆశ్రే హోం ఫర్ ఏజ్డ్ 9000495026
బేగంపేట ఫ్లైఓవర్, బ్రాహ్మణివాడ అమన్ వేదిక 9966831014
బేగంపేట ఫ్లైఓవర్(రికవరీ), బ్రాహ్మణివాడ అమన్ వేదిక 9966831014
