క్రిస్మస్‌కు విడుదలైన సినిమాల్లో ‘శంబాల’ సక్సెస్‌గా నిలబడటం గ్రేట్ అచీవ్‌మెంట్ అని దిల్ రాజు అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్రేక్ ఈవెన్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా మూవీ టీమ్‌ను దిల్ రాజు అభినందిస్తూ ‘ఈ సినిమాకు పబ్లిక్‌లో మంచి టాక్ రావడం, విజయవంతంగా నిలబడటం చాలా సంతోషకర విషయం. ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా చేంజ్ తీసుకొచ్చింది.
నిజంగా ‘బొమ్మరిల్లు 2’ తీయాలంటే మాత్రం ఆది, వాళ్ళ నాన్న సాయి కుమార్‌లతో తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపన మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్ తన కొడుకుతో పాటు శంబాల టీమ్ మొత్తానికి బ్యాక్ బోన్‌గా నిలిచి సినిమా విజయంలో భాగమయ్యారు’ అని అన్నారు. ఇకపై కెరీర్‌ను మరింత బాగా ప్లాన్ చేసుకుంటానని ఆది సాయికుమార్ చెప్పాడు.
ఈ సినిమాను టాలీవుడ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటోందని సాయికుమార్ అన్నారు. ఈ సినిమా కంటిన్యూస్‌గా 11 రోజులు హౌస్‌ఫుల్‌తో ప్రదర్శించబడిందని, జనవరి 9న హిందీలో రిలీజ్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.
