ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యలపై  బల్దియా స్పెషల్​ డ్రైవ్

ప్రాపర్టీ ట్యాక్స్ సమస్యలపై  బల్దియా స్పెషల్​ డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించిన సమస్యలను సర్కిల్ స్థాయిలోనే పరిష్కరించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి  మార్చి 31 వరకు  ప్రతి ఆదివారం స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, కోర్టు కేసులు, ఇతర సమస్యల పరిష్కరించుకు నేందుకు ఆయా రోజుల్లో  ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  అందుబాటులో ఉంటామని తెలిపారు. సంబంధిత వ్యక్తులు  తమ పరిధిలోని   సర్కిల్ ఆఫీసుకు వెళ్లి ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించిన సమస్యలను  పరిష్కరించుకోవాలని కోరారు. ఈ నెలలో  6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం రోజుల్లో, మార్చి 6, 13, 20,  27  తేదీల్లో సమస్యలు  పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.