బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన జీహెచ్‌ఎంసీ

బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్: ఆన్ లైన్ సెల్లింగ్ స్టోర్ బిగ్ బాస్కెట్ గోడౌన్స్ పై జీహెచ్ ఎంసీ అధికారులు దాడులు నిర్వంచారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని లైసెన్స్ సస్పెండ్ చేశారు.  కొండాపూర్‌లోని మసీదు బండలోని బిగ్ బాస్కెట్ గోదాంలో జీహెచ్ ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో గడువు ముగిసిన పలు రకాల పదార్థాలను గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు GHMC నోటీసు జారీ చేసింది , తదుపరి నోటీసు వచ్చేవరకు బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది.

తనిఖీలో చికెన్ మసాలా, చికెన్ సాసేజ్ లు, పిజ్జా చీజ్ , పనీర్, ఐస్ క్రిం, బాదం ఫడ్జ్ తో సహా గడువు ముగిసిన పలు రకాల ఆహార పదార్థాలను గుర్తించారు. నూనె లీకేజీతో దిగువ రాక్‌లలోని ఇతర ఆహార వస్తువులను కలుషితం చేస్తున్నట్లు గుర్తించారు. పాల సీసాలు,  మందపాటి షేక్ సీసాలు , స్టింగ్ టిన్ సీసాలు ఔట్ డేటెడ్ గా ఉన్నట్టు గుర్తించారు. 

కాగా గత కొన్ని రోజులుగా నగరంలోని పలు హోటళ్లపై జీహెచ్ ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించని హోటళ్లను చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఆహారం విషయంలో సరైన ప్రమాణాలు పాటించని 55 హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యం లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో మరిన్నిదాడులు నిర్వహిస్తామని జీహెచ్ ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.