సీఆర్ఎస్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

సీఆర్ఎస్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  జీహెచ్ఎంసీలో ఫేక్ బర్త్, డెత్​సర్టిఫికెట్ల జారీకి చెక్ పడనుంది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీ ఆర్ ఎస్) ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయనుంది. ఈ సిస్టంలో మైగ్రేన్ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం జీహెచ్ఎంసీ లేఖ  రాయగా, ఇందుకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబరితి ఆమోదించారు. ఈ అంశంపై ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్, సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు  సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సిస్టమ్​కు అనుమతి ఇస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో  డైరక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి  దేశవ్యాప్తంగా ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఓఆర్ జీఐ) ఆధ్వర్యంలోని సీఆర్ఎస్  పోర్టల్ లో మైగ్రేన్ కానుంది. ఆ తరువాత సీఎస్​ఆర్ ద్వారా సర్టిఫికెట్లు జారీ కానున్నాయి.