
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ రెవెన్యూ అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తూ మెటర్నిటీ లీవ్తీస్కున్న స్నేహాశబరీశ్ 180 రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరారు. కమిషనర్ఆర్వీ కర్ణన్ఆమెకు అడ్వర్ టైజ్ మెంట్ విభాగం అడిషనల్కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అడిషనల్కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సుభద్రాదేవికి ఆ బాధ్యతలు తప్పించి, యూబీడీ ఇన్చార్జి అడిషనల్కమిషనర్ గా నియమించారు.
అడ్వర్ టైజ్ మెంట్ విభాగం అడిషనల్కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించిన వేణుగోపాల్ రెడ్డికి ట్రాఫిక్, స్ట్రీట్ లైట్ల విభాగాలను అప్పగించారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించిన అన్ని ఫైళ్లు అడిషనల్కమిషనర్ద్వారానే వెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.