హైదరాబాద్సిటీ, వెలుగు: అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్న 19 మందిపై మెట్రో వాటర్బోర్డు విజిలెన్స్అధికారులు కేసు నమోదు చేశారు. ఎస్సార్ నగర్ తట్టిఖానా సెక్షన్ పరిధిలో ఇటీవల బల్దియా రోడ్డు నిర్మాణం చేపట్టింది.
ఇదే అదునుగా కాలనీకి చెందిన 19 మంది అనుమతులు లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. ఫిర్యాదులు రావడంతో వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ 19 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
