ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. విజిలెన్స్ విచారణకు GHMC ఆదేశం

ఫేక్ సర్టిఫికెట్ల స్కాం.. విజిలెన్స్ విచారణకు GHMC ఆదేశం

 హైదరాబాద్ లో ఫేక్ బర్త్ , డెత్ సర్టిఫికెట్లజారీపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.  ఇవాళ సెలవు కావడంతో  మార్చి 8 నుంచి విచారణ చేపడుతామని   జీహెచ్ఎంసీ  అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు.  31 వేల నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ బ్లాక్ చేసింది.  అయితే బ్లాక్ చేసిన వారు  సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తే.. వాటిని పరిశీలించి అన్ బ్లాక్ చేసి  కొత్త సర్టిఫికేట్స్ ఇస్తామని కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు.

మార్చి 6న  హైదరాబాద్ వ్యాప్తంగా 27 వేల బర్త్ సర్టిఫికెట్ల్స్, నాలుగు వేల డెత్ సర్టిఫికెట్స్ ను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా సర్టిఫికెట్లను  జారీ చేసిన మీ సేవ సెంటర్లపై లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సౌత్ జోన్ టాస్క్ పోర్స్  పోలీసులు  తనిఖీలు చేశారు. పోలీసుల చర్యలతో  జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ లోని మీ సేవ సెంటర్లో అధికారులు తనిఖీలు చేశారు. మెహదీపట్నం ,చార్మినార్, బేగంపేట్, సికింద్రాబాద్ సర్కిల్ లో జారీ చేసిన  31 వేల సర్టిఫికెట్లను గుర్తించిన అధికారులు రద్దు చేశారు.