దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆదివారం (జూన్ 07) ఈ చిత్రం నుంచి స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కళ్యాణ్ నాయక్ పాటను కంపోజ్ చేయగా, భాస్కరభట్ల రవికుమార్ క్యాచీ లిరిక్స్ రాశారు.
‘గిర్రున..గిర్ర గిర్ర గిర్రున పారిపోతే సిగ్గులు తుర్రున.. పట్టిపట్టిచూడవు పట్టించుకోవు ఏంటి బంగారం.. నువ్వు టక్కున టక్కు టక్కు టక్కున నా బుగ్గకు ముద్దులు టక్కు టక్కుమని పెట్టి చేయరా గారాబం.. ’ అంటూ సాగిన ఈ స్పెషల్ సాంగ్‌లో వడ్డే నవీన్‌తోపాటు అనైరా గుప్తా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
సాహితి చాగంటి, స్వరాగ్ కీర్తన్ కలిసి పాడిన ఈ పాటకు విజయ్ పోలాకి కొరియోగ్రఫీ అందించాడు. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, దేవి ప్రసాద్, బాబా బాస్కర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జూన్ 19న సినిమా విడుదల కానుంది.
