మెట్రో స్టేషన్లో ఇరుక్కున్న చిన్నారి.. కాపాడిన జవాన్

మెట్రో స్టేషన్లో ఇరుక్కున్న చిన్నారి.. కాపాడిన జవాన్

న్యూఢిల్లీ: చిన్నారులు కొన్ని సమయాల్లో తెలియక సరదాగా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ఎనిమిదేండ్ల బాలిక ఆడుకుంటూ.. మెట్రో స్టేషన్ లోని 25 ఫీట్ల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లింది. కానీ భయంతో తిరిగి వెనక్కిరావడానికి అడుగు కదల్చలేకపోయింది. ఏడుస్తూ ఫెన్సింగ్ దగ్గర అలాగే ఉండిపోయిన చిన్నారిని ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ కాపాడాడు.

ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేష‌న్‌లో ఆదివారం సాయంత్రం సంభవించింది. ప్రాణాల‌తో సేఫ్గా బ‌య‌ట‌ప‌డ్డ బాలిక‌ను ఆమె త‌ల్లిదండ్రుల‌కు పోలీసులు అప్పగించారు. ఆ చిన్నారి ఇల్లు మెట్రో స్టేష‌న్‌కు స‌మీపంలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికకు ఎలాంటి ప్రమాదం సంభ‌వించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్ పొలిటికల్ టూరిస్ట్లాగా మారిండు

ఇండియన్స్ తరలింపులో మరో కంపెనీ

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు