
జీడిమెట్ల, వెలుగు: స్విమ్మింగ్ పూల్ లో పడి ఓ బాలిక మృతిచెందింది. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎన్ఎసీఎల్ గ్రేటర్కమ్యూనిటీకి చెందిన డోలి నిఖిల్‌కుమార్ కూతురు ఆద్య(8)కు ఈత నేర్పించేందుకు సోమవారం స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లాడు. తండ్రి కూతురు స్విమ్మింగ్చేశాక నిఖిల్కుమార్తన డ్రెస్ మార్చుకునేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి తన కూతురు కన్పించలేదు. కొద్దిసేపటి తర్వాత స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఉండటం చూసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.