చిన్నారిని చితకబాదిన టీచర్

చిన్నారిని చితకబాదిన టీచర్

రాయపర్తి, వెలుగు:  వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో శనివారం ఓ చిన్నారిని టీచర్​ చితకబాదాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాలోని  ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న హలవత్ శ్రీజను టీచర్​ ఆకారపు స్వామి వీపుపై తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి.  విషయం తెలుసుకున్న శ్రీజ పేరెంట్స్​  సుశీల, చిరంజీవి పాఠశాల ముందు ఆందోళన వ్యక్తం చేశారు.  

టీచర్​ స్వామి అక్కడి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.  స్టూడెంట్స్​ పేరెంట్స్​, పలువురు తండా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీచర్​ కొట్టింది నిజమేనని హెచ్​ఎం ధ్రువీకరిస్తూ తగు చర్య తీసుకోవాలని ఎంఈవోకు లెటర్ ద్వారా కంప్లైంట్ చేశారు.