
హైదరాబాద్, వెలుగు: సర్పంచులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బిల్లులు విడుదల చేయకపోవటంతో సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోలు మండలానికి చెందిన లోకల్ బాడీ లీడర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించా రు. ఎన్నిక ల కసరత్తు ఆపి, ప్రజల సమస్యలు తీర్చాలని రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు.