ఆ 280 మందికి పరిహారం ఇవ్వండి: మంత్రి శ్రీధర్​బాబు

ఆ 280 మందికి పరిహారం ఇవ్వండి: మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: లడ్నాపూర్​ ఓపెన్​ కాస్ట్​ మైన్​  కోసం సింగరేణి కాలరీస్​ సేకరించిన భూముల్లో ఇండ్లు కట్టుకున్న 280 మందికి ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ చెల్లింపు విషయంపై లబ్ధిదారులతో చర్చలు జరపాలని అధికారులను మంత్రి శ్రీధర్​ బాబు ఆదేశించారు. ఆదివారం సెక్రటేరియెట్​లో సింగరేణి సీఎండీ బలరాం​, పెద్దపల్లి కలెక్టర్  శ్రీహర్ష, సింగరేణి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. 

లడ్నాపూర్​లో ఓపెన్​ కాస్ట్​ మైన్​ కోసం 2012లో సింగరేణి సంస్థ 103 ఎకరాల భూమి సేకరించింది.  అందులో 466  ఇండ్లకు పరిహారం, ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ కింద 722 మందికి రూ.7.5 లక్షల చొప్పున చెల్లించింది. ప్రజల పునరావాసం కోసం సింగరేణి రూ.145 కోట్లు విడుదల చేసింది. అయితే, సింగరేణి సేకరించిన ఆ భూమిలో 1400 మంది ఇండ్లు కట్టుకుని పరిహారం కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్​ బాబు చొరవతో వారికి రూ.30 కోట్ల పరిహారాన్ని సింగరేణి అందించింది.