కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వండి: ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లెటర్‌

కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వండి: ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు లెటర్‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ సర్కారు ఎలాంటి అనుమతులు లేకుండా కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వాలని కృష్ణా బోర్డు (కేఆర్‌‌ఎంబీ) ఆ రాష్ట్రానికి లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ కెపాసిటీ పెంపు, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీం ద్వారా తీసుకునే నీటిని తరలించేందుకు చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు అడ్మినిస్ట్రేటివ్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చారని, వాటి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎస్కేప్‌‌ చానల్‌‌, నిప్పులవాగు విస్తరణ, గాలేరు, కుందు నదుల విస్తరణ, ప్రొటెక్షన్‌‌ వాల్స్‌‌, ఇతర నిర్మాణాలు, నీటి తరలింపు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచుతూ చేపట్టే పనుల డీటైల్డ్‌‌ ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాలంది. ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతు ల్లేవని, అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం తమకు ఫిర్యాదు చేసినట్టు లేఖలో పేర్కొంది.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్