జాదవ్ కోసం భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి: పాకిస్తాన్ కోర్టు

జాదవ్ కోసం భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి: పాకిస్తాన్ కోర్టు

పాకిస్తాన్ జైల్లో మరణశిక్ష అనుభవిస్తున్నారు భారత్‌ నౌకదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌. ఆయన తరపున న్యాయవాదిని నియమించేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాక్  ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఆదేశాలతో జాదవ్‌కు పాక్‌ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించడానికి ఆయన తరఫున న్యాయవాదిని నియమించే విషయమై పాక్‌ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఐహెచ్సీ విచారణ జరుపుతోంది. ఈ కేసు విచారణను ఐహెచ్సీ వచ్చేనెల 3కు వాయిదా వేసింది. రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్ జాదవ్‌ (50)కు పాకిస్తాన్ సైనిక కోర్టు 2017 ఏప్రిల్‌లో గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై మరణశిక్ష విధించింది.