పెళ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

పెళ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

హైదరాబాద్: పెండ్లి జరుగుతున్న సమయంలోనే కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. లగ్న పత్రిక రాయించుకున్న రోజే కల్యాణ లక్ష్మీ స్కీమ్​కు దరఖాస్తు చేసుకుంటే.. 15 రోజుల్లోనే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి పెండ్లి రోజే చెక్కు అందజేసే ప్రయత్నం చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని అందరూ అభినందిస్తున్నారని గంగుల అన్నారు.