57 ఏండ్ల వారికి పెన్షన్​ ఇచ్చి,65 ఏండ్ల వాళ్లను మర్చిపోతరా! : నిమ్మల రాఘవ రెడ్డి

57 ఏండ్ల వారికి పెన్షన్​ ఇచ్చి,65 ఏండ్ల వాళ్లను మర్చిపోతరా! : నిమ్మల రాఘవ రెడ్డి

65 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు ఓల్డ్​ఏజ్​ పెన్షన్​ అనుమతిస్తామని లోగడ ప్రభుత్వం ప్రకటించింది. 4 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ నేటికీ ఆఫ్​లైన్​ పద్దతి ద్వారా ఎంపీడీఓ కు సమర్పించుకొని డీఆర్​డీఓ లో ఆన్​లైన్​ చేయబడిన అభ్యర్థనలకు ఆమోద ముద్ర వేయబడక పెండింగ్​లో ఉన్నాయి. 2022 సెప్టెంబర్​లో 57 సంవత్సరాలు నిండి ఆన్ లైన్​లో అభ్యర్థనలు పెట్టుకొని ఉన్నవారికి పెన్షన్​ మంజూరు గావించారు. 65 ఏండ్ల వారిని ప్రభుత్వం మర్చిపోయింది. న్యాయంగా 65 ఏండ్లు దాటిన వారికి ముందు అనుమతించి, ఆపైన 57 ఏండ్ల వారికి పెన్షన్​ ఆమోదించాలి. లేదా ఇరువురికీ ఒకేసారి ఆమోదం తెల్పినా బాగుండేది. అలా చేయలేదు.

57 ఏండ్ల వారికి  పెన్షన్​ మంజూరు చేసి, 65 ఏండ్లు పై బడ్డవారికి ప్రభుత్వం గుండు సున్నా పెట్టింది. ప్రభుత్వం ఇలాంటి తప్పిదం చేయడం సిగ్గుచేటు. 65 ఏండ్ల పై బడ్డ వారు పౌరులు కారా? ఓటర్లు కారా? రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో  అప్లికేషన్​లు పెండింగ్​లోనే ఉన్నాయి. వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయం గమనించి అర్హులైన వారి  అప్లికేషన్లను వెంటనే పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలి. ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే ప్రభుత్వం. ఈ యదార్థామును పరిశీలించి అర్హులైన దరఖాస్తుదారులందరికీ ఈ నెలలోనే పెన్షన్​ మంజూరు చేయాలని ఆశిస్తున్నాం. - నిమ్మల రాఘవ రెడ్డి, జైనాథ్​ మండలం, ఆదిలాబాద్ జిల్లా