42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీసీలకు అన్యాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్

42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీసీలకు అన్యాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణలో అమలు చేయనున్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అదే జరిగితే అసెంబ్లీ లోపల, బయటా బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. బీసీ జాబితా నుంచి ముస్లింలను తీసేస్తేనే మద్దతిస్తామని చెప్పారు. 

తెలంగాణలో12 శాతమున్న ముస్లిలంకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా..? 51 శాతమున్న బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయడమేంటని ప్రశ్నించారు. అలాగైతే బీసీలకు అదనంగా దక్కేది 5 శాతం మాత్రమేనని అన్నారు. అతి త్వరలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తామని తెలిపారు. 

రాజకీయాలకు అతీతంగా సీఎంకు అండగా ఉంటాం:

బనకచర్లపై తెలంగాణ వాదనను గట్టిగా విన్పించాలని సీఎం రేవంత్ కు సూచించారు బండి సంజయ్.  బనకచర్ల విషయలో రాజకీయాలకు అతీతంగా  సీఎంకు అండగా ఉంటామని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.