గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్..అందాలు చూస్తూ తినొచ్చు

 గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్..అందాలు చూస్తూ తినొచ్చు

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు రెస్టారెంట్లు సరికొత్త థీమ్ తో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. రకరకాల టేస్టీ ఫుడ్ తో కస్టమర్ల టేస్ట్ బడ్స్ కు శాటిస్ఫై చేస్తున్నాయి. ఇదే కోవలో కాశ్మీర్ లో ఓ హోటల్ నిర్వాహకులు గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఫుడ్ ఎంజాయ్ చేసేలా దీన్ని నిర్మించారు. 

ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా గుల్‌మార్గ్‌లో ఉన్న కొలాహోయ్ గ్రీన్ హైట్స్ హోటల్ మేనేజ్ మెంట్ కొన్నాళ్ల క్రితం ఈ గ్లాస్ వాల్ రెస్టారెంట్ నిర్మించింది. మంచు మధ్యలో ఏర్పాటు చేసిన ఈ ఆసియాలో అతిపెద్ద స్నో ఇగ్లూ రెస్టారెంట్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. టూరిజాన్ని ప్రోత్సహించేందుకు తాము కొత్త మార్గాలను అన్వేషిస్తుంటామని హోటల్ జనరల్ మేనేజర్ హమీద్ మసూది స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఫిన్లాండ్ సహకారంతో ఈ ఇగ్లూ గ్లాస్ కాన్సెప్ట్‌ తెరపైకి తెచ్చినట్లు చెప్పారు. 

ఇగ్లూ రెస్టారెంట్ అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ గ్లాస్ ఇగ్లూను విజిట్ చేయాలని టూరిస్టులు అంటున్నారు. ఇగ్లూ లోపల కూర్చొని, ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ.. లంచ్ లేదా డిన్నర్‌ చేయడం చెప్పలేని అనుభూతిని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ గ్లాస్ ఇగ్లూను చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు చాలా మంది వస్తున్నారు. కాసేపు అందులో కూర్చొని, చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేసి వెళ్తున్నారు.