యూఎస్‌‌‌‌ లో గ్లెన్‌‌‌‌ మార్క్‌‌‌‌, గ్రాన్యూల్స్‌‌‌‌, సన్ ఫార్మా మందుల రీకాల్‌‌‌‌

యూఎస్‌‌‌‌ లో గ్లెన్‌‌‌‌ మార్క్‌‌‌‌, గ్రాన్యూల్స్‌‌‌‌, సన్ ఫార్మా మందుల రీకాల్‌‌‌‌

న్యూఢిల్లీ: భారతీయ ఫార్మా కంపెనీలు గ్లెన్‌‌‌‌మార్క్‌‌‌‌, గ్రాన్యూల్స్‌‌‌‌ ఇండియా, సన్ ఫార్మా, జైడస్‌‌‌‌, యూనికెమ్‌‌‌‌ తయారీ లోపాల కారణంగా తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్ నుంచి స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నాయి. 

యూఎస్ ఎఫ్‌‌‌‌డీఏ రిపోర్ట్ ప్రకారం, గ్లెన్‌‌‌‌మార్క్  తన గోవా ప్లాంట్‌‌‌‌లో తయారు చేసిన అజెలైక్‌‌‌‌ యాసిడ్ జెల్‌‌‌‌ ట్యూబ్స్‌‌‌‌ను క్లాస్ 2 రీకాల్ చేపడుతోంది. గ్రాన్యూల్స్ ఇండియా 49 వేల బాటిళ్ల ఏడీహెచ్‌‌‌‌డీ మందులను క్లాస్‌‌‌‌ 3 రీకాల్ చేసింది. 

ఈ మందులో మిశ్రమ లోపాలు ఉండడమే కారణం. సన్ ఫార్మా రెనాల్ ఇమేజింగ్ కిట్స్‌‌‌‌ను, జైడస్   ఎంటెకావిర్‌‌‌‌‌‌‌‌ యాంటివైరల్‌‌‌‌ మందులను క్లాస్‌‌‌‌ 2 రీకాల్ చేస్తున్నాయి. లేబుల్స్ కలిసిపోవడం వల్ల  యూనికెమ్‌‌‌‌ కొన్ని మందులను క్లాస్‌‌‌‌1 రీకాల్‌‌‌‌ చేసింది.