అమెరికాలో గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌, డాక్టర్ రెడ్డీస్ మందుల రీకాల్‌‌‌‌‌‌‌‌

అమెరికాలో గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌, డాక్టర్ రెడ్డీస్ మందుల రీకాల్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియన్ ఫార్మా కంపెనీలు  గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌, డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌  తయారీ లోపాల కారణంగా కొన్ని మందులను అమెరికాలో రీకాల్ చేసుకుంటున్నాయి.  యూఎస్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌డీఏ ప్రకారం, గ్లెన్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ  26,928 ప్యాకెట్ల  గర్భనిరోధక మందులు వయోరెలె, డెసోజెస్ట్రల్‌‌‌‌‌‌‌‌, ఇథినైల్‌‌‌‌‌‌‌‌ ఎస్ట్రాడియల్‌‌‌‌‌‌‌‌ ట్యాబ్లెట్లను  రీకాల్ చేస్తోంది. ఈ మందుల్లో మలినాలు ఉన్నాయని గుర్తించారు.  ఈ బ్యాచ్ గోవా ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో తయారయ్యింది. 

సెప్టెంబర్ 3న క్లాస్‌‌‌‌‌‌‌‌ 2 రీకాల్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమైంది. డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌ యూఎస్‌‌‌‌‌‌‌‌ఏ  కూడా 571 వయల్స్‌‌‌‌‌‌‌‌ సకినైల్‌‌‌‌‌‌‌‌కోలైన్‌‌‌‌‌‌‌‌ క్లోరైడ్‌‌‌‌‌‌‌‌ ఇంజెక్షన్స్‌‌‌‌‌‌‌‌ను రీకాల్ చేస్తోంది. దీనిని కండరాల రిలాక్సేషన్‌‌‌‌‌‌‌‌ కోసం వాడతారు. స్టెబిలిటీ  లోపాల కారణంగా సెప్టెంబర్ 26న క్లాస్‌‌‌‌‌‌‌‌ 2 రీకాల్‌‌‌‌‌‌‌‌ చేపట్టింది. మందులు వాడాక  తాత్కాలిక లేదా వైద్యపరంగా తగ్గే  ఆరోగ్య సమస్యలు వస్తే క్లాస్‌‌‌‌‌‌‌‌ 2 రీకాల్‌‌‌‌ను యూఎస్‌‌‌‌ ఎఫ్‌‌‌‌డీఏ ఇష్యూ చేస్తుంది.