RCB vs RR: రాజస్థాన్‌తో కీలక పోరు.. మ్యాక్స్‌వెల్ స్థానంలో విధ్వంసకర ఓపెనర్!

RCB vs RR: రాజస్థాన్‌తో కీలక పోరు.. మ్యాక్స్‌వెల్ స్థానంలో విధ్వంసకర ఓపెనర్!

ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ లో ఫ్లాప్ షో చేస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ లో బరిలోకి దిగిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రెండు డకౌట్ లతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో అరకొర రాణిస్తున్నా.. అతని స్పెల్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఆర్సీబీ వరుస పరాజయాలకు మ్యాక్స్ వెల్ కూడా ఒక కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మ్యాక్స్ వెల్ స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ విల్ జాక్స్ కు స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లోనే గెలిచి మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. జట్టులో ఒక ఫారెన్ బౌలర్ తో పాటు కెప్టెన్ డుప్లెసిస్ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలి. ఆల్ రౌండర్ గా గ్రీన్ స్థానానికి ఎలాంటి డోకా లేదు. ప్రస్తుతం అసాధారణ ఫామ్ తో ఉన్న విల్ జాక్స్ జట్టులోకి రావాలంటే మ్యాక్స్ వెల్ తప్పుకోక తప్పదు. ఒకవేళ గ్రీన్ ను తప్పిస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత దెబ్బ తింటుంది. దీంతో జాక్స్ ను ఆడించాలంటే ఆర్సీబీ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పదు. 

ఫ్యాన్స్ నుంచి ఎక్స్ పర్ట్స్ వరకు జాక్స్ జట్టులో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరు తమ తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఇప్పటివరకు టోర్నీలో ఓటమి తెలియని పటిష్టమైన రాజస్థాన్ ను ఓడించాలంటే విల్ జాక్స్ కు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఆలోచిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లీగ్ జరిగిన అదరగొట్టేస్తున్న ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ కు ఇప్పటికైనా చోటు ఇవ్వకపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్లడం కష్టంగానే కనిపిస్తుంది. మరోవైపు బౌలర్ టాప్లె స్థానంలో లాకీ ఫెర్గుసన్ కు అవకాశం ఇవ్వొచ్చు.