2026 ఐపీఎల్కు మ్యాక్స్వెల్ దూరం.. IPLకు గుడ్ బై చెప్పేసినట్టే..!

2026 ఐపీఎల్కు మ్యాక్స్వెల్ దూరం.. IPLకు గుడ్ బై చెప్పేసినట్టే..!

ఐపీఎల్ కెరీర్కు మరో స్టార్ ప్లేయర్ గుడ్ బై చెప్పినట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ 2026 ఐపీఎల్లో ఆడటం లేదని ప్రకటించాడు. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ మినీ వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని మ్యాక్స్వెల్ ప్రకటించాడు. ఇప్పటికే ఐపీఎల్ నుంచి రస్సెల్, ఫాఫ్ డు ప్లెసిస్ వైదొలిగిన సంగతి తెలిసిందే. మ్యాక్స్వెల్ కూడా ఇదే బాటను ఎంచుకోవడంతో ఒక స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లయింది. కొన్ని సీజన్ల నుంచి ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ఫామ్ కూడా అంత గొప్పగా లేకపోవడం గమనార్హం.

మ్యాక్స్ వెల్పై గంపెడాశలు పెట్టుకుని కోట్లు పోసి కొనుకున్న ఫ్రాంచైజీలకు నిరాశే మిగిలింది. ఐపీఎల్ లో ఎన్నో మర్చిపోలేని సీజన్లు ఆడిన తాను ఈసారి వేలంలో తన పేరు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు మ్యాక్స్వెల్ సోషల్ మీడియా వేదికగా చెప్పేశాడు. ఇది చాలా కీలక నిర్ణయం అని తనకు తెలుసని.. ఈ లీగ్ తనకు చాలా ఇచ్చిందని.. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మ్యాక్స్ వెల్ తెలిపాడు. మ్యాక్స్వెల్ గతేడాది శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడాడు. వేలికి గాయం కావడంతో సీజన్కు దూరమయ్యాడు.

2024లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మ్యాక్స్ వెల్ను 4.2 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. చెన్నై, హైదరాబాద్ ఫ్రాంచైజీలు కూడా మ్యాక్స్వెల్ కోసం పోటీపడ్డాయి. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీల అంచనాలను అందుకోవడంలో మ్యాక్స్ వెల్ ఫెయిల్ అవడం గమనార్హం.

గత సీజన్లో ఆరు ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్సీ 48 పరుగులు మాత్రమే చేశాడు. శ్రేయాస్ అయ్యర్ బౌలర్గానే మ్యాక్స్వెల్ను ఎక్కువగా వాడాడు. మ్యాక్స్వెల్ మొత్తం 141 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 23.88 సగటుతో 2 వేల 819 పరుగులు చేశాడు. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కెరీర్‌ను ప్రారంభించాడు. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాక్స్ వెల్ను రూ. 14.25 కోట్లు చెల్లించి రికార్డు ధరకు సొంతం చేసుకుంది.