AUS vs WI, 2nd T20I: రోహిత్ రికార్డు సమం చేసిన మ్యాక్స్ వెల్

AUS vs WI, 2nd T20I: రోహిత్ రికార్డు సమం చేసిన మ్యాక్స్ వెల్

టీ20 స్పెషలిస్ట్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవలే భారత్ తో సెంచరీ చేసి స్వదేశానికి వెళ్లిపోయిన మ్యాక్సీ.. తాజాగా వెస్టిండీస్ పై సెంచరీతో సత్తా చాటాడు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న సెకండ్ టీ20 లో 55 బంతుల్లోనే 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ మిచెల్ మార్ష్ తర్వాత క్రీజ్ లోకి వచ్చి విండీస్ బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ తన టీ20 కెరీర్ లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

ఈ సెంచరీతో మ్యాక్స్ వెల్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక సెంచరీల రికార్డ్ సమం చేశాడు. 143 ఇన్నింగ్స్ లో రోహిత్ 5 సెంచరీలు చేస్తే.. మ్యాక్సీ మాత్రం 94 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించాడు. మ్యాక్స్ వెల్ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్ (31), మిచెల్ మార్ష్ (29) వేగంగా ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్ కి రెండు, అల్జారి జోసెఫ్, షెపర్డ్ కు తలో వికెట్ లభించింది.

 లక్ష్య ఛేదనలో విండీస్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (5), నికోలస్ పూరన్ (18) తక్కువ పరుగులకే  ఔటయ్యారు. చార్లెస్ (24), హోప్ (0) క్రీజ్ లో ఉన్నారు. ఈ సిరీస్ లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది.