న్యూజిలాండ్ తో మ్యాచ్ .. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 310/9

న్యూజిలాండ్ తో మ్యాచ్  ..  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 310/9

సిల్హెట్ (బంగ్లాదేశ్) :  ఆఫ్​ స్పిన్నర్ గ్లెన్​ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ (4/37) నాలుగు వికెట్లతో సత్తా చాటడంతో మంగళవారం మొదలైన మొదటి టెస్టులో న్యూజిలాండ్ తొలి రోజు బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ను 310/9 స్కోరుకు కట్టడి చేసింది. ​టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఆతిథ్య బంగ్లా టీమ్‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్ మహ్ముదుల్​ హసన్​ జాయ్ (86) సత్తా చాటాడు. మరో ఓపెనర్ జాకీర్ హసన్ (12), ముష్ఫికర్ రహీమ్ (12) ఫెయిలవగా.. కెప్టెన్ నజ్ముల్ శాంటో (37), మోమినుల్ హక్​ (37), షహదత్ హొస్సేన్​ (24), నురుల్ హసన్ (29) ఫర్వాలేదనిపించారు. మరోవైపు కివీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి బంగ్లాకు బ్రేకులు వేశారు. ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌తో పాటు కైల్ జేమిసన్, అజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.  ప్రస్తుతం తైజుల్ ఇస్లాం (8 బ్యాటింగ్), షోరిఫుల్ ఇస్లాం (13 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.