త్వరలో హైదరాబాద్​లో గ్లోబల్​ ఏఐ సమ్మిట్ : శ్రీధర్ బాబు

త్వరలో హైదరాబాద్​లో గ్లోబల్​ ఏఐ సమ్మిట్ : శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌‌గా మార్చే లక్ష్యంతో రానున్న రోజుల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్‌‌ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ఇన్ఫోసిస్‌‌కు చెందిన రఘు బొడ్డుపల్లి, గూగుల్ నుంచి అరిజిత్ సర్కార్, టీఐఈ నుంచి మురళీ బుక్కపట్నం, సైయంట్ నుంచి బీవీఆర్ మోహన్ రెడ్డి, టీసీఎస్ నుంచి రాజన్న.వి, పర్పుల్ టాక్, టీవీఏజీఏ నుంచి శ్రీధర్ ముప్పిడితో సహా ఐటీ సంఘాలు, ప్రముఖులతో జరిగిన ఇంటరాక్షన్ సెషన్‌‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఏఐ సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్నికల్ ఎక్స్​పర్ట్స్​ను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్‌‌(హెచ్ సీసీబీ) కంపెనీ చీఫ్ హిమాన్షు ప్రియదర్శి నేతృత్వంలోని ప్రతినిధి బృందం  మంత్రి  శ్రీధర్ బాబును కలిసింది. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌‌ లో చేపట్టిన గ్రీన్‌‌ఫీల్డ్ ప్రాజెక్టుపై  బృందం వివరించింది. కంపెనీకి ప్రభుత్వ సహకారం అందిస్తామని హెచ్ సీసీబీ బృందానికి మంత్రి హామీ ఇచ్చారు.