ప్రపంచవ్యాప్తంగా రాబోయే 10 ఏళ్లలో ఉద్యోగాల వేట యుద్ధ ప్రాతిపదికన మారబోతోందని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా హెచ్చరించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతూ.. రాబోయే 12 నుండి 15 ఏళ్లలో ఎదురయ్యే జాబ్ క్రైసిస్ గురించి షాకింగ్ లెక్కలను ఆయన బయటపెట్టారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 120 కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటే.. వారికి అందుబాటులో ఉన్న అవకాశాలు కేవలం 40 కోట్లు మాత్రమేనని అజయ్ బంగా స్పష్టం చేశారు.
80 కోట్ల మందికి నిరుద్యోగ గండం..?
రాబోయే దశాబ్ద కాలంలో ప్రతి ముగ్గురు యువకుల్లో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం దొరికే అవకాశం ఉందన్నారు అజయ్ బంగా. 120 కోట్ల మందిలో మిగిలిన 80 కోట్ల మంది యువత పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలు మార్పులు తీసుకువచ్చినా.. ఈ భారీ అంతరాన్ని పూడ్చడం అంత సులభం కాదని హెచ్చరించారు. ప్రభుత్వాలు కేవలం ఉద్యోగాలను సృష్టించే వాతావరణాన్ని మాత్రమే కల్పించగలవని, అసలైన ఉపాధి ప్రైవేట్ రంగం నుండే వస్తుందని బంగా గుర్తుచేశారు.
ALSO READ : సీనియర్ సిటిజన్ల పన్ను డిమాండ్లను నిర్మలమ్మ ఈ సారి వింటారా..?
సింగపూర్ మోడల్..
సింగపూర్ వంటి దేశాలను ఉదాహరణగా చూపుతూ.. వ్యాపార అనుకూల విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలు ఉంటేనే ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెడుతుందని బంగా వివరించారు. ముఖ్యంగా MSMEల ద్వారానే ఎక్కువ ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, వాటికి ఆర్థిక వెన్నుదన్నం అందించడమే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. కేవలం ఇతర దేశాల నుంచి వచ్చే అవుట్‌సోర్సింగ్ పనులపైనే ఆధారపడటం ప్రమాదకరమని, స్వదేశీ తయారీ రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ALSO READ : స్టాక్ మార్కెట్లో 20 శాతం పడిపోయిన వెండి ETFs: అంటే.. కిలో వెండి 60 వేలు తగ్గుతుందా..?
వ్యవసాయం నుంచి పర్యాటకం వరకు.. 5 రంగాలపై ఫోకస్ ఉద్యోగాల కొరతను అధిగమించేందుకు ప్రపంచ బ్యాంక్ జాబ్స్ కౌన్సిల్ ఐదు కీలక రంగాలను గుర్తించింది:
1. మౌలిక సదుపాయాలు
2. ప్రైమరీ హెల్త్ కేర్
3. చిన్న రైతులు పట్టణాలకు వలస వెళ్లి 'నగర పేదలు'గా మారకుండా, వారికి టెక్నాలజీ, మార్కెట్ యాక్సెస్ కల్పించడం.
4. అత్యధిక ఉపాధినిచ్చే పర్యాటకం రంగం.
5. వాల్యూ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్
ALSO READ : గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు తగ్గాయోచ్..
ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాక యువత నగరాలకు వలస వెళ్తున్నారని, వారిని పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహించడం ద్వారా ఈ భారీ ఉద్యోగ గండాన్ని కొంతవరకు అధిగమించవచ్చని అజయ్ బంగా వెల్లడించారు. చూడాలి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలతో ఈ భారీ జాబ్ క్రైసిస్ ఎదుర్కోవటానికి సిద్ధం అవుతాయనేది రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా.
