Hunger: ఈ షార్ట్ ఫిలిం చూశారా? ఏకంగా 10 అంతర్జాతీయ అవార్డులు..ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్ వచ్చేస్తుండు!

Hunger: ఈ షార్ట్ ఫిలిం చూశారా? ఏకంగా 10 అంతర్జాతీయ అవార్డులు..ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్ వచ్చేస్తుండు!

వెండితెర...'నిన్ను చూచాను..నన్ను మరిచాను'..'ఒక్క క్షణం..ఒక్క గమ్యం'..అది వెండితెరపై మన ఊపిరి సంతకం.అదొక్కటే "సినిమా".ప్రతి మేకర్ సినిమా ఇండస్ట్రీ రాకముందు..తన నోట్ పుస్తకాలలో,రోడ్డుపై కనిపించిన ప్రతి పేపర్ ముక్కపై ఏదో ఒకటి సినిమా కోసం రాసుకుంటూ ఉంటారు.

సినిమా అనే ఒక ఫ్యాషన్..అందుకోసం ఎంతోమంది జాబ్స్ ప్రిపేర్ అవ్వకుండా,ఉన్న జాబ్స్ వదిలేసి కూడా సినిమా రంగంలోకి వస్తుంటారు.ఇక ఇలాంటి కోవకి చెందినవాడే "న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్న గోపాల్ బోడేపల్లి"(Gopal Bodepalli).ఈయన తెరకెక్కించే షార్ట్ ఫిలిమ్స్ కి వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉంది.

తాజాగా గోపాల్ బోడేపల్లి నిర్మిస్తూ,దర్శకత్వం వహించిన 'హంగర్'(Hunger)అనే షార్ట్ ఫిలిమ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ అవార్డులు వరించాయి.ఇప్పటి వరకు ఈ షార్ట్ ఫిలిమ్ కు 10 అంతర్జాతీయ అవార్డులు వరించాయి.వరసగా ఆ అవార్డులు చూసుకుంటే..'ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హానరబుల్ మెన్షన్ అవార్డుని గెల్చుకుంది.అంతే కాకుండా ప్యారిస్,లండన్ ఉత్సవాలతో పాటు మరో 10 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను'హంగర్'గెల్చుకుందని మేకర్స్ వెల్లడించారు. 

గోపాల్ బోడేపల్లి డైరెక్షన్‌లో ఇంతకు ముందు చేసిన ‘మరణం’అనే షార్ట్ ఫిల్మ్ సైతం 34 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డు గెల్చుకుని ప్రశంసలు దక్కించుకుంది.ఇక ఇతను తీసిన మరణం,హంగర్ సినిమాలు ఇటీవల దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అఫీషియల్ సెలక్షన్‌కి కూడా ఎంపిక అయ్యాయి. మరి ఫ్యూచర్ లో 70mm సినిమా తీస్తాడేమో చూడాలి ఈ డైరెక్టర్.అంతేకాదు  ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అఫీషియల్ సెలక్షన్‌కి కూడా ఎంపిక అయ్యాయి. హంగర్ షార్ట్ ఫిలిం మీరు కూడా ఒకసారి చూసేయండి.