Global Running Day: ప్ర‌పంచ ర‌న్నింగ్ డే.. ఇలా పరిగెత్తండి.. ఫిట్ గా ఉంటారు

Global Running Day: ప్ర‌పంచ ర‌న్నింగ్ డే.. ఇలా పరిగెత్తండి.. ఫిట్ గా ఉంటారు

రన్నింగ్.. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నుకునే ఉత్తమ మార్గం. దీని వల్ల హృదయ మెరుగ్గా పనిచేస్తుంది., బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. ఒత్తిడిని అధిగమించడానికి, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రన్నింగ్ ఒక గొప్ప మార్గం. గుండెకు మేలు చేసే పరుగు వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌లో పెరుగుదల:

దీనిని డెన్సిటీ లిపోప్రొటీన్ లేదా హెచ్‌డిఎల్ అంటారు. ఈ కొలెస్ట్రాల్ రక్త నాళాలలో కొలెస్ట్రాల్ నిక్షేపణను నిరోధించడంలో సహాయపడుతుంది.

2. రక్తం గడ్డకట్టే ధోరణిని తగ్గించడం:

రన్నింగ్ రక్తం గడ్డకట్టే ధోరణులను రన్నింగ్ తగ్గిస్తుంది. ఇది గుండెపోటును ప్రేరేపించే అవకాశాలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

3. కరోనరీ కొలేటరల్స్ వృద్ధి:

కరోనరీ కొలేటరల్‌లను పెంచడంలోనూ రన్నింగ్‌ సహాయపడుతుంది. ఎవరైనా ధమని వ్యాధి బారిన పడినా లేదా మూసుకుపోయినా గుండెకు నష్టం జరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అవి వ్యాధిగ్రస్తులైన ప్రాంతానికి రక్త సరఫరాను అందించే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పరుస్తాయి.

4. మానసిక ఒత్తిడి తగ్గింపు :

రన్నింగ్‌తో సహా రెగ్యులర్ వ్యాయామం శారీరక శ్రమను మాత్రమే కాకుండా మానసిక శక్తిని కూడా పెంచుతుంది. వ్యాయామం చేసేటప్పుడు మనస్సు రోజువారీ ఆందోళనల నుండి మళ్లించబడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతతలో సహాయపడుతుంది. గుండెపై మానసిక ఒత్తిడి దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.

Also Read:వైన్ బాటిల్స్ కొనండి.. కొనిపియ్యండి.. ప్రతి నెలా రూ.20 వేల జీతం.. కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

పరుగు ప్రతి ఒక్కరికీ ముఖ్యమా?

రన్నర్‌లు కానివారు లేదా కఠినమైన వ్యాయామాలు చేసే అలవాటు లేని వ్యక్తులు జాగ్రత్తగా వైద్యులు, ఫిట్‌నెస్ శిక్షకుల సలహా మేరకు పరుగు చేయడం ప్రారంభించాలి. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ లాంటి ఇతర ఏరోబిక్ వ్యాయామాలు కూడా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే రోజూ కఠినమైన శారీరక శ్రమ చేయకూడదు.