60 శాతం దేశాల్లోనే హెల్దీ స్కూల్స్​.. పాఠశాలల్లో ఫుడ్​, బేవరేజెస్​పై కఠిన నిబంధనలు

 60 శాతం దేశాల్లోనే హెల్దీ స్కూల్స్​.. పాఠశాలల్లో ఫుడ్​, బేవరేజెస్​పై కఠిన నిబంధనలు
  • పాఠశాలల్లో ఫుడ్​, బేవరేజెస్​పై కఠిన నిబంధనలు
  • 17 స్కూల్స్​లోనే కరిక్యులమ్​లో పోషకాహార విద్య
  • యునెస్కో గ్లోబల్​ ఎడ్యుకేషన్​మానిటరింగ్​ రిపోర్ట్​లో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లోని స్కూళ్లలోనే పిల్లలకు ఆరోగ్యకర ఆహారం అందుతున్నది. ఈ పాఠశాలల్లో ఆహార, పానీయాలకు సంబంధించి కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. పిల్లలకు పోషకాహారం అందించడంపై పాఠశాలలు, ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి. మిగతా 40 దేశాల్లోని స్కూళ్లలో పిల్లలకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో అనారోగ్యకర ఆహారం అందుతున్నది. ఈ వివరాలు యునెస్కో  గ్లోబల్​ ఎడ్యుకేషన్​ మానిటరింగ్​ రిపోర్ట్​లో వెల్లడయ్యాయి.

ఈ నివేదికను ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’ నేతృత్వంలోని ‘రీసెర్చ్ కన్సార్టియం ఫర్ స్కూల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్’ పరిశోధన నిర్వహించి ప్రచురించాయి. ఈ రిపోర్ట్​ ప్రకారం.. 187 దేశాల్లో 93 కంట్రీస్​లోని పాఠశాలల్లో మాత్రమే ఫుడ్, బెవరేజెస్​పై తప్పనిసరి మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులోని 29 శాతం దేశాల్లోని పాఠశాలల్లో అనారోగ్యకర ఆహార, పానీయాలను నిషేధించే కఠిన నిబంధనలున్నాయి.  

50% కంటే ఎక్కువ స్కూల్స్​లో పోషకాహారలోపం

ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కంటే ఎక్కువ స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్స్​లో పండ్లు, కూరగాయలు తగినంతగా లేవని రిపోర్ట్​లో వెల్లడైంది. అంటే ఈ స్కూళ్లలో పోషకాహార లోపం ఎక్కువగా ఉన్నది. మూడింట ఒక వంతు స్కూళ్లలో చక్కెరతో కూడిన డ్రింక్స్​ను అందిస్తున్నారని, ఇది పిల్లల్లో ఒబేసిటీతోపాటు ఇతర అనారోగ్య సమస్యలను తీసుకొస్తున్నట్టు రిపోర్ట్​లో తేలింది. గత రెండు దశాబ్దాల్లో 100కు పైగా దేశాల్లోని చిన్నారుల్లో ఊబకాయం రెట్టింపైంది.  అలాగే 30 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. స్కూళ్లలో పోషకాహార విద్యను ఎక్స్​ట్రా కరిక్యులర్ ​లేదా ప్రాజెక్ట్​ బేస్డ్​ ప్రోగ్రామ్​లాగా మాత్రమే అందిస్తున్నారు. 

అంటే కరిక్యులమ్​లో దీన్ని భాగం చేయడం లేదు.  17 దేశాలు మాత్రమే పోషకాహార విద్యను కరిక్యులమ్​లో చేర్చారు. 161 దేశాల్లో 418 మిలియన్ల మంది పిల్లలు స్కూల్ మీల్స్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. భారత్​లో పీఎం పోషణ్​ స్కీమ్ ​ద్వారా రోజూ 118 మిలియన్ల మంది చిన్నారులకు ఆహారం అందుతున్నది. ఇది  ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఒకటిగా గుర్తింపు పొందినా.. ఆహార వైవిధ్యం లేకపోవడం వల్ల పిల్లల్లో పోషకాహార లోపాలు ఉన్నట్టు రిపోర్ట్​లో తేలింది.