నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ భూమిని, నిషేదిత భూములను నిబంధనలకు విరుద్ధంగా  రిజిస్ట్రేషన్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.  ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు లంచాలకు మరిగిన అధికారులు  అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ  సంపాదించుకుంటున్నారు. 

ఆగస్టు 23న  మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్  అశోక్ సస్పెండ్ అయ్యారు. బాచుపల్లి నిషేధంలో ఉన్న 83సర్వే నెంబర్లో గల  భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ  సస్పెండ్  చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

 ఈ భూ ట్రాన్స్ ఫర్ లో భారీగా నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది.  కోట్లు విలువ చేసే భూమిని  సబ్ రిజిస్ట్రార్  గిఫ్ట్ రిజిస్ట్రేషన్  చేయడం ద్వారా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ తగ్గించారాని 22a లో, నిషేధిత జాబితాలో  ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై ఐజీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.