
30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు. చంద్రబోస్ లిరిసిస్ట్‌గా, అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో దర్శకుడు మున్నా ధూళిపూడి కాంబోలో ఈ పాట సిద్ధమవుతోంది. మున్నా రూపొందిస్తున్న ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రంలో ఈ పాటను కంపోజ్ చేస్తున్నారు.
‘ఇలా చూసుకుంటానే’ అంటూ ఈ పాట రానుందని చెబుతూ రిలీజ్ చేసిన ప్రీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ‘నీలి నీలి ఆకాశం’ కంటే బాగా వచ్చిందని దర్శకుడు మున్నా చెప్పాడు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ కలిసి నిర్మిస్తున్నారు.