
చిరంజీవి-బాబీ కలయికలో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాను అధికారంగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో మూవీ పోస్టర్ రిలీజ్ చేసి చిరుకు బర్త్డే విషెష్ తెలియజేశారు. రక్తసిక్తమైన గొడ్డలితో ఉన్న పోస్టర్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. దానికితోడు 'ది బ్లెడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్ మార్క్' అనే క్యాప్షన్ మూవీపై మరిన్నీ అంచనాలు పెంచింది.
మొత్తానికి సినిమా టోన్, కాన్సెప్ట్‌పై బాబీ ఇచ్చిన ఈ అప్డేట్, మెగా ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ అందిస్తుంది. ఈ సినిమాని కన్నడ బడా బ్యానర్ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' నిర్మిస్తుంది. యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్, దళపతి విజయ్ జన నాయకుడు వంటి భారీ సినిమాలను నిర్మిస్తుంది ఈ సంస్థనే.
చిరు-బాబీ కలయికలో 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సాధించింది. చిరంజీవి మాస్ ప్రెజెంటేషన్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, ఈ సినిమా లాంగ్ రన్లో ఏకంగా రూ.236 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇపుడు ఇదే కలయికలో మూవీ వస్తుండటం మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.
►ALSO READ | Ram Charan: బెస్ట్ ఫాదర్ అంటే మీరే నాన్న.. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రామ్ చరణ్
చిరు బర్త్ డే పురస్కరించుకుని ఇప్పటికే పలు సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. అందులో విశ్వంభర నుంచి గ్లింప్స్ రిలీజ్ అవ్వగా, అనిల్ రావిపూడి మూవీకి సంబంధించి టైటిల్ టీజర్ విడుదల చేశారు.