Ram Charan: బెస్ట్ ఫాదర్ అంటే మీరే నాన్న.. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రామ్ చరణ్

Ram Charan: బెస్ట్ ఫాదర్ అంటే మీరే నాన్న.. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి 70వ బర్త్డే స్పెషల్గా సోషల్ మీడియాలో విషెష్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మెగా తనయుడు, హీరో రామ్ చరణ్ సైతం తనదైన ప్రేమను తెలుపుతూ చిరుకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించి ఓ వీడియో పంచుకున్నారు.

ఈ సందర్భంగా తాను పొందిన ప్రతి విజయం తండ్రి చిరంజీవి వల్లే సాధ్యమైందని చరణ్ గుర్తుచేసుకున్నారు. ‘నా హీరోవి నువ్వే. నా మార్గదర్శివే నువ్వే. నాపై అభిమానులు చూపే ప్రేమ, గౌరవం అన్నీ నీవల్లే నాన్న’అంటూ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఇచ్చిన క్యాప్షన్ మెగా అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.

“నాన్నా.. ఇది కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు.. మీరు ఎంత అద్భుతమైన వ్యక్తి అని జరుపుకునే నిజమైన పండుగ. మీరు నా హీరో, నా మార్గదర్శి, నా స్ఫూర్తి. నేను సాధించిన ప్రతి విజయం, నేను కలిగి ఉన్న ప్రతి విలువ మీ నుండి వచ్చినదే. 70 ఏళ్ళ వయసులో కూడా మీరు మనసు పరంగా మరింత యవ్వనంగా, ఎప్పటికంటే మరింత ఎక్కువ స్ఫూర్తిదాయకంగా ఎదుగుతున్నారు.

►ALSO READ | 'SSMB29' టైటిల్ రివీల్.. జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా గ్లోబల్ సర్ప్రైజ్!

మీరు ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా, మరెన్నో అందమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కోరుకునే ఓ అత్యుత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు” అని చరణ్ తన క్యాప్షన్లో రాసుకొచ్చాడు. 

ఈ క్రమంలో చరణ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన వీడియో సైతం నెటిజన్లని ఆకర్షిస్తుంది. ఇందులో ఫస్ట్ చిరంజీవి కేక్ కట్ చేసి చరణ్కి తినిపించాడు. ఆ తర్వాత చరణ్ తన తండ్రి చిరంజీవికి కేక్ తినిపిస్తూ, ఆశీర్వాదం తీసుకున్నాడు. అలాగే, చిరుని హాగ్ చేసుకుని తన శుభాకాంక్షలు తెలిపారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా అభిమానులు ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ‘తమ అభిమాన నటుడు, మెగా అన్నయ్యకు’ పుట్టినరోజు శుభాకాంక్షలు అని విషెష్ తెలియజేస్తున్నారు. 

ప్రస్తుతం చిరంజీవి 70 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వంభర, అనిల్ రావిపూడితో “మన శంకరవరప్రసాద్ గారు”, శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ, డైరెక్టర్ బాబీతో మరో మూవీ చేస్తున్నారు.

ఇందులో మొదటగా అనిల్ రావిపూడి మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత  విశ్వంభర సమ్మర్ లో వస్తుండగా, దసరా బరిలో శ్రీకాంత్ ఓదెల మూవీ నిలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.