ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు చట్టరూపం దాల్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించిన తర్వాత ఈ బిల్లును రాష్ట్రపతికి పంపారు. పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇకపై ఆన్‌లైన్ గేమింగ్‎పై ఈ నూతన చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. 

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించే ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్ బిల్లు 2025’ బుధవారం (ఆగస్ట్ 20) లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ప్రతిపక్షాల నిరసనల మధ్య పాస్ అయింది. గురువారం (ఆగస్ట్ 21) ఈ బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టగా.. లోక్ సభలో మాదిరిగానే ఇక్కడ కూడా విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లు పాస్ అయ్యింది. 

►ALSO READ | అవును.. మునీర్ చెప్పింది నిజమే: పాక్ పరువు తీసిన మంత్రి రాజ్‎నాథ్ సింగ్

రియల్ మనీ గేమింగ్ (పోకర్, ఫాంటసీ స్పోర్ట్స్) నిషేధించడం, ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించడం దీని లక్ష్యం. అలాగే భారత్‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ గేమింగ్ హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని కూడా టార్గెట్ ​పెట్టుకున్నారు. ఈ బిల్లు ప్రకారం సెంట్రల్ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. ఇది గేమ్స్‌‌‌‌‌‌‌‌ను ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్, సోషల్, రియల్ మనీ గేమ్స్ అని నాలుగు రగాలు వర్గీకరిస్తుంది. 

రియల్ మనీ గేమ్స్ ను ఆఫర్ చేయోద్దు, వాటికి సహకారం అందివొద్దు.. అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌మెంట్​నూ  నిషేధించారు. బ్యాంకులు కూడా వీటి లావాదేవీలు చేయకూడదు. రియల్ మనీ గేమ్స్ నిర్వహిస్తే మూడేండ్ల జైలు లేదా రూ.1 కోటి జరిమానా విధిస్తారు. రెండూ కూడా విధించవచ్చు. వీటిని అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌ చేస్తే రెండేండ్ల జైలు, రూ.50 లక్షల ఫైన్​. మళ్లీమళ్లీ చేస్తే ఐదేండ్ల జైలు, రూ.2 కోట్ల ఫైన్​ విధిస్తారు. ఇవి కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలు. వీటిని ఆడేవారిని బాధితులుగా పరిగణిస్తారు.