అవును.. మునీర్ చెప్పింది నిజమే: పాక్ పరువు తీసిన మంత్రి రాజ్‎నాథ్ సింగ్

అవును.. మునీర్ చెప్పింది నిజమే: పాక్ పరువు తీసిన మంత్రి రాజ్‎నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ఇండియా, పాక్ ఆర్థిక వ్యవస్థలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సెటైర్ వేశారు. ఇండియా ఎకానమీ ఫెరారీ కార్ లాంటిదని.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఒక డంపర్ ట్రక్ వంటిదని మునీర్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. పాక్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ వాళ్ల వైఫల్యాన్ని అంగీకరించడమేనని ఎద్దేవా చేశారు. పాక్, ఇండియా రెండు దేశాలు ఒకేసారి స్వాతంత్రం పొందాయి. 

ఇందులో ఇండియా కష్టపడి పనిచేయడం ద్వారా ఫెరారీ కార్ లాంటి దూసుకుపోయే ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదం, నిత్యం భారత్‎పై విషం చిమ్మడం ద్వారా ఇప్పటికీ డంపర్ స్థితిలో ఉందని.. అది వాళ్ల స్వంత వైఫల్యమని చురకలంటించారు రాజ్‎నాథ్ సింగ్. అసిమ్ మునీర్ చేసిన ఈ ప్రకటనను పాక్ వైఫల్యాన్ని ఒప్పుకోలుగానే తాను చూస్తున్నానని అన్నారు. అదే సమయంలో మునీర్ ప్రకటనను కేవలం ట్రోల్ మెటీరియల్‌గా కాకుండా ఈ తీవ్రమైన హెచ్చరికపై మనం సీరియస్‎గా దృష్టి పెట్టకపోతే అది మనకు ఇబ్బంది కల్గించవచ్చన్నారు

►ALSO READ | శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్టు.. ప్రజా నిధుల దుర్వినియోగం కేసులో సంచలనం..

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అమెరికాలో పర్యటించాడు. ఓ కార్యక్రమంలో ఆయన భారతదేశం, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులను పోల్చాడు. భారత ఆర్థిక వ్యవస్థ ఫెరార్ కారు లాంటింది అయితే.. పాక్ ఎకానమీ కంకరతో నిండిన డంపర్ ట్రక్ అని పేర్కొన్నాడు. డంపర్ వెళ్లి ఫెరారీని ఢీకొడితే ఎవరికీ నష్టం జరుతుందని భారత్‎పై విషం చిమ్మాడు. 

ఇండియా, పాక్ ఎకానమీలపై మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలు బూమారాంగ్ అయ్యాయి. మునీర్ చెప్పింది నిజమేని.. పాక్ ఆర్ధిక వ్యవస్థ ఒక చెత్త బుట్ట అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో మునీర్ వ్యాఖ్యలపై మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై విధంగా రియాక్ట్ అయ్యారు. మునీర్ చెప్పింది నిజమేనంటూ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు దిమ్మతిరిగే పోయే కౌంటర్ ఇచ్చారు రాజ్‎నాథ్ సింగ్.