
ఆన్ లైన్ బెట్టింగ్ పై ప్రభుత్వం నిషేధం విధించినా బెట్టింగ్ రాయుళ్లు మాత్రం తగ్గడం లేదు. సీక్రెట్ గా బెట్టింగ్ ఆడుతూనే ఉన్నారు. శుక్రవారం (ఆగస్టు 22) నిర్మల్ జిల్లాలో బెట్టింగ్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల దగ్గర పట్టుబడిన ఆస్తులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
జిల్లాలో బెట్టింగ్ రాయుళ్లపై దాడులు జరిపిన పోలీసులు.. భైంసా పట్టణానికి చెందిన సయ్యద్ ఆజం అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. బెట్టింగ్ పాల్పడుతున్నాడనే పక్కా ఆధారాలతో ఆజం ను అదుపులోకి తీసుకున్నారు.
►ALSO READ | హైదరాబాద్ అమీర్పేట్లో హనీ ట్రాప్.. 81 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ. ఏడు లక్షలు ఎలా కాజేశారో చూడండి !
సయ్యద్ ఆజం దగ్గర భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సుమారు కోటిన్నర రూపాయలు విలువచేసె ఆస్తి పత్రాలు,38 తులాల బంగారం, రూ.16.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దగ్గర పట్టుబడిన భారీ ఆస్తులకు సంబంధించి జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల. ఇతనితో పాటు ఎంత మంది ఉన్నారు.. బెట్టింగ్ ముఠా వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.