- ఇతర వార్డుల్లో ఓటు రావడంతో అయోమయం
నిర్మల్, వెలుగు: నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చాలామంది ఓటర్లు తమకు సంబంధంలేని వేరే వార్డుల్లో ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మరికొందరు అయోమయానికి గురయ్యారు. ఓటేసేందుకు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ జాబితాలో తమ పేరు లేదని తెలుసుకొని గందరగో ళానికి లోనయ్యారు.
అయితే పక్క వార్డు ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయని అక్కడ పోటీ చేసే అభ్యర్థులు సమాచారం ఇవ్వడంతో తాము నివాసముండే వార్డుల్లో కాకుండా వేరే చోట ఎందుకు ఓటు వేస్తామని ప్రశ్నించారు. చేసేదేంలేక ఆ వార్డుల్లోకి వెళ్లి ఓటేశారు. మహిళా ఓటర్లు, వృద్ధులు తీవ్ర ఇ బ్బందులకు గురయ్యారు.
